NTV Telugu Site icon

John Wich 4: ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా…

John Wick 4

John Wick 4

కీను రీవ్స్ అంటే ఇండియన్ మూవీ లవర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ‘జాన్ విక్’ అంటే చాలు ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. యాక్షన్ సినిమాలకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘జాన్ విక్’ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 2014లో జాన్ విక్ ఫస్ట్ పార్ట్ బయటకి వచ్చింది. ఆ సమయంలో జాన్ విక్ సినిమా చూసిన వాళ్లు, ఇలాంటి యాక్షన్ సినిమాని కలలో కూడా ఊహించలేదు అనుకుని ఉంటారు. పెన్సిల్ తో మనుషులని చంపడడం, కార్ కోసం మనుషులని చంపడం, కుక్క కోసం చంపడం, తన సర్వైవల్ కోసం మనుషులని చంపడం… ఓవరాల్ గా ‘ఎక్స్ గ్యాంగ్ స్టర్ జాన్ విక్’కి బ్రతకాలి అంటే మనుషులని చంపాల్సిందే అనే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి అండర్ వరల్డ్ మాఫియాని అతను ఎలా ఫేస్ చేస్తున్నాడనే యాక్షన్ సర్వైవల్ స్టొరీనే జాన్ విక్ సీరీస్ లో ఉంటుంది.

ఇప్పటివరకూ ఈ సీరీస్ నుంచి మూడు పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు జాన్ విక్ 4 రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్చ్ 24న వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కేవలం నిమిషమున్నర ఉన్న ఈ పార్ట్ 4 ట్రైలర్ చూస్తే… ఇది కదా జాన్ విక్ రేంజ్ యాక్షన్ అంటే అనిపించక మానదు. ఈ సీరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా చూడొచ్చు అని ప్రతి ఒక్కరికీ అనిపించడం గ్యారెంటీ. ఫ్రీడమ్ ఈజ్ డెత్ అనే హుక్ లైన్ తో బయటకి వచ్చిన ఈ ట్రైలర్ జాన్ విక్ 4పై ఇప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచింది. మరి కీను రీవ్స్ ఈసారి జాన్ విక్ గా మనుషులని ఎలా చంపుతాడు? ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కొత్తగా ఏం చూపిస్తాడు అనేది చూడాలి.

Show comments