John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!

John Abraham 300kb

John Abraham 300kb

John Abraham: బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ‘Te3n’, ‘The Girl on the Train’ వంటి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన రిభు దాస్‌గుప్తా ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుండగా, ఈ నెలలోనే లండన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో జాన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం మాత్రం మేకర్స్ ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంచారు. అయితే ఈ పాత్ర జాన్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఎవరూ ఊహించని షేడ్స్ తో చాలా  ఇంటెన్సిటీగా అతని పాత్రని రూపొందిస్తున్నట్లు సమాచారం.

జాన్ కూడా ఈ పాత్ర విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పైకి కనిపించేంత సింపుల్‌గా ఈ క్యారెక్టర్ ఉండదని, పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయని సమాచారం. అందుకే షూటింగ్ కి ముందే క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడంపై జాన్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ద్వారా జాన్‌లో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని మరో కోణాన్ని దర్శకుడు రిభు దాస్‌గుప్తా బయటకు తీసుకురాబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. రిభు దాస్‌గుప్తాకు థ్రిల్లర్ జానర్‌లో మంచి అనుభవం ఉంది. అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘Te3n’, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘The Girl on the Train’ వంటి సినిమాలను ఆయన రూపొందించారు. అందుకే జాన్ అబ్రహం లాంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోతో రిభు దాస్‌గుప్తా ఎలాంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నారనే క్యూరియాసిటీ మొదలైంది.

ఇదిలా ఉంటే జాన్ అబ్రహం మరోవైపు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Maria IPS’ కోసం కూడా భారీగానే  శ్రమిస్తున్నాడు. ఈ సినిమాలో నిజ జీవిత పోలీస్ అధికారి రాకేష్ మారియా పాత్రను జాన్ పోషిస్తున్నాడు. కథలో ఆ అధికారి జీవితంలోని వివిధ దశలను చూపించాల్సి ఉండటంతో జాన్ తన లుక్, బాడీ విషయంలో కూడా భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా డైరెక్షన్ లో వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ టైటిల్, కథ, జాన్ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. లండన్ షెడ్యూల్ ఈ నెలలో మొదలైన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.