Site icon NTV Telugu

బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రముఖ మోడల్.. కారణం అదేనా.?

gungun upadhyay

gungun upadhyay

ప్రముఖ మోడల్ గున్‌గున్‌ ఉపాధ్యాయ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్‌గున్‌ ఉపాధ్యాయ్‌.. జోధ్ పూర్ కి చెందిన ఒక మోడల్.. ఇటీవలే ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేణు రోజుల క్రితం ఉదయ్‌పూర్‌ వెళ్లివచ్చిన ఆమె శనివారం రతనాద ప్రాంతంలోని లార్ట్స్‌ ఇన్‌ హోటల్‌లో బసచేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం అర్ధరాత్రి హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దూకే ముందు తండ్రికి ఫోన్ చేసి తానూ చనిపోతున్నట్లు తెలిపింది. దీంతో కంగారుపడ్డ ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొనేలోపే ఆమె అక్కడి నుంచి దూకేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే గున్‌గున్‌ ఉపాధ్యాయ్‌ ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక ప్రేమ విఫలమవ్వడమే కారణమని తెలుస్తోంది. మరి నిజానిజాలు బయటపడాలంటే గున్‌గున్‌ ఉపాధ్యాయ్‌ స్పృహలోకి రావాలంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

Exit mobile version