దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. పండగ సీజన్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓవరాల్ గా 300 కోట్లు రాబట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నా వారిసు/వారసుడు మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది. వారిసు మూవీకి రిలీజ్ కన్నా ముందు బజ్ క్రియేట్ చేశాడు తమన్. రంజితమే సాంగ్ ఎప్పుడు బయటకి వచ్చిందో అప్పటినుంచే వారిసు సక్సస్ స్టార్ట్ అయిపొయింది. ఆ తర్వాత బయటకి వచ్చిన ప్రతి పాట యుట్యూబ్ ని శేక్క్ చేసింది. రిలీజ్ కి ముందు వదిలిన లిరికల్ వీడియోస్ కే అలా ఉంటే వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తే విజయ్ ఫాన్స్ సైలెంట్ గా ఉంటారా మిలియన్ వ్యూస్ ఇచ్చేయరూ.
తాజాగా జిమిక్కీ పొన్ను సాంగ్ విషయంలో జరుగుతున్నది కూడా ఇదే. తమన్ కంపోజ్ చేసిన జిమ్మికీ పొన్ను సాంగ్ ని అనిరుధ్, జోనితా కలిసి పాడారు. ఇన్స్టాంట్ హిట్ అయిన ఈ సాంగ్ వీడియో వర్షన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసింది టీ-సీరీస్. బయటకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యుట్యూబ్ ని షేక్ చేస్తుంది జిమిక్కీ పొన్ను సాంగ్. ఈ పాటలో విజయ్ చేసిన డాన్స్ సూపర్బ్ గా ఉంటుంది. శోభి మాస్టర్ స్టైలిష్ గా కంపోజ్ చేసిన స్టెప్స్ ని అంతే స్టైలిష్ గా వేశాడు విజయ్. ఈ సాంగ్ లో రష్మిక కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థైస్ చూపిస్తూ, పొట్టి బట్టలు వేసుకోని మోడరన్ లుక్ లో కనిపించింది. రష్మిక తెలుగులో చేసిన ఏ సినిమాలో కూడా ఇంత హాట్ గా డ్రెస్ వేసుకోలేదు. విజయ్ తో కలిసి రష్మిక చేసిన డాన్స్, అనిరుద్ వాయిస్ జిమిక్కీ పొన్ను సాంగ్ ని వారిసు ఆల్బమ్ లో చాలా స్పెషల్ గా మార్చాయి.