ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల పరమపదించారు. ఆరంభం నుంచి చిత్రపరిశ్రమతో మమేకమై సాగిన తండ్రి మృతి సునీల్ కి ఆశనిపాతమే. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడుగా కూడా చేసిన నారాయణదాస్ అడుగుజాడలలోనే అటు పంపిణీ రంగంలో, ప్రదర్శనరంగంలో తనదైన ముద్రవేసి ఇప్పుడు నిర్మాణంలో కూడా అడుగు పెట్టాడు సునీల్.
తండ్రి దూరమైన ఖేదంలో ఉన్న సునీల్ కి మోదాన్ని కలిగించింది కుమార్తె జాన్వీ నారంగ్. లండన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్‌లో జాన్వీ నారంగ్ మార్కెటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నిజానికి జాన్వీ నారంగ్ 2020లోనే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే కోవిడ్ పరిమితుల కారణంగా గ్రాడ్యుయేషన్ ఈవెంట్ వాయిదా పడింది. ఆమె తన బ్యాచ్ టాపర్‌లలో ఒకరు. గత నెలలో పెళ్లి చేసుకున్న జాన్వీ నారంగ్ ఇటు కుటుంబ వ్యవహారాలతో పాటు తండ్రి బిజినెస్ పై కూడా దృష్టి సారిస్తున్నారు
