NTV Telugu Site icon

Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం

Vijay Yesudas House Theft

Vijay Yesudas House Theft

Jewellery Theft In Singer Vijay Yesudas House In Chennai: ఇటీవల సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన మరువక ముందే.. మరో సెలెబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్‌ కుమారుడు, సింగర్‌ అయిన విజయ్ యేసుదాసు ఇంట్లో దోపిడీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలో ఉంటున్న విజయ్ నివాసంలో.. 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలు, కొన్ని డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. తమ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన విజయ్ భార్య దర్శన.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Guahar Khan: రంజాన్ ఉపవాసంపై సింగర్ షాకింగ్ కామెంట్స్.. గౌహర్ కౌంటర్

గతేడాది డిసెంబర్‌లో ఒక పెళ్లి వేడుకకు హాజరైన తర్వాత తాను ఒక లాకర్‌లో బంగారు నగలు పెట్టానని తన ఫిర్యాదులో దర్శన పేర్కొంది. అయితే.. ఫిబ్రవరి 18వ తేదీన లాకర్ తెరిచి చూసినప్పుడు, ఆ నగలు అందులో లేవని తెలిపింది. వాటి కోసం ఎక్కడా వెతికినా దొరక్కపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్ అయిన వాటిల్లో ఎనిమిది గోల్డ్ ఇయర్ రింగ్స్, ఐదు డైమండ్ ఇయర్ రింగ్స్, 24 సవర్ల అన్‌కట్ డైమండ్, ఒక బంగారం లాకెట్, మరో డైమండ్ లాకెట్ మిస్ అయినట్టు దర్శన చెప్పింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఐపీసీ పీనల్ కోడ్ 380 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యేసుదాసు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు.

Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు

Show comments