NTV Telugu Site icon

Jennifer Mistry: సెట్‌లో అవమానించారు, నీళ్ల కోసం ఆ దుస్థితి.. లైవ్‌లోనే ఏడ్చేసిన నటి

Jennifer Mistry

Jennifer Mistry

Jennifer Mistry Shares Her Bad Experience During Tarak Mehta Ka Ooltah Chashmah Shooting: అత్యంత ప్రజాదరణ పొందిన ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ను ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆ షో నుంచి ఒక్కొక్కరుగా బయటకొస్తున్న నటీనటులు.. ఆ షో నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేస్తుండటమే అందుకు కారణం. సెట్‌లో తమకు సరైన గౌరవం దక్కేది కాదని, లైంగిక వేధింపులు కూడా ఎదుర్కున్నామని.. ఆ షోలో నటించిన నటీమణులు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వారిలో జెన్నీఫర్ మిస్త్రీ ఒకరు. ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత.. షో నిర్మాతలు తనని లైంగికంగా వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనకు షోలో ఎదురైన మరిన్ని చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రొడక్షన్ టీమ్ తమ బట్టల్ని ఉతికేవాళ్లు కాదని.. దుర్వాసన వస్తున్నా వాటిని ధరించాల్సి వచ్చేదని కుండబద్దలు కొట్టింది.

LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

జెన్నీఫర్ మాట్లాడుతూ.. ‘‘సెట్‌లో మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ప్రొడక్షన్ టీమ్ మా బట్టలను 20 రోజుల వరకూ ఉతికే వాళ్లు కాదు. దాంతో.. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చేది. వాటినే తొడుక్కుని షూట్‌లో పాల్గొనేవాళ్లు. కొన్నిసార్లు ఆ కంపు భరించలేక.. మేమే ఉతక్కున్న సందర్భాలు ఉన్నాయి. చివరికి తాగేనీరు కోసం అడుక్కునే పరిస్థితి కూడా ఉండేది. ఎందుకంటే.. సెట్‌లో కేవలం కొన్ని వాటర్ బాటిల్స్ మాత్రమే ఉండేవి. మాకు నీళ్లు కావాలని అడిగితే.. మమ్మల్ని తిట్టేవారు. అసలు సెట్‌లో బిస్కెట్ ప్యాకెట్ దొరకడమే గగనం. అది దొరికితే.. మహాప్రసాదంలా భావించేవాళ్లం. ఇక నైట్ షిఫ్ట్‌లో అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చేవారు కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. తాను ఈ షో జరిగినన్నీ రోజులూ.. తన సొంత జ్యూవెలర్లీనే ధరించానంది. కొవిడ్ టైంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శానిటైజేషన్ మాత్రమే చేశారని తెలిపింది.

Anasuya: అక్కడ టాటూ చూపిస్తూ రెచ్చగొడుతున్న అనసూయ.. ఆ టాటూ ఎవరి పేరో తెలుసా..?

తాముండే కారావాన్స్ కూడా శుభ్రంగా ఉండేవి కావని, వాటిల్లో బొద్దింకలు ఉండేవని జెన్నిఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా తన చేదు అనుభవాల్ని పంచుకుంటూ.. ఆమె ఇంటర్వ్యూలో ఒక్కసారిగా ఏడ్చేసింది. కాగా.. తనకు సకాలంలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం, వేధింపులు గురి కావడంతో.. ఈ ఏడాది మార్చిలో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో నుంచి మిస్త్రీ బయటకొచ్చేసింది. ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత నిర్మాత తన చెంప గిల్లాడని, అసభ్యంగా ప్రవర్తించాడని, మద్యం తాగాలని బలవంతం చేశాడని ఆరోపణలు చేసింది. వీటిని నిర్మాత తోసిపుచ్చాడు కానీ, ఈ వ్యవహారం ఇంకా వాడీవేడీగానే సాగుతోంది.