జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు సినిమాలని డైరెక్ట్ చేసిన జీవిత రాజశేఖర్, దాదాపు ముప్పై మూడేళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యింది. మూడు దశాబ్దాల గ్యాప్ తర్వాత జీవిత కెమెరా ముందుకి వచ్చి నటించడానికి రెడీ అవ్వడం గొప్ప విషయం, అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ చెయ్యడం గ్రేట్ అనే చెప్పాలి.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ అనే సినిమా తెరకెక్కుతుంది.విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో విక్రాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. క్రికెట్ బేస్డ్ కథతో తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మల్టీలాంగ్వేజస్ లో తెరకెక్కుతున్న లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ కూడా స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. రజినీ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆయన చెల్లి పాత్రలో మాత్రం జీవిత రాజశేఖర్ నటిస్తుందని సమాచారం. మార్చి 7 నుంచి జరగనున్న షెడ్యూల్ కోసం జీవిత చెన్నై వెళ్లనుంది. ఈ షెడ్యూల్ లో రజినీకాంత్, జీవిత రాజశేఖర్ మధ్య మెయిన్ సీన్స్ ని తెరకెక్కించడానికి ఐశ్వర్యా రజనీకాంత్ రెడీ అవుతోంది. ఈ మూవీతో జీవిత రాజశేఖర్ తన యాక్టింగ్ కెరీర్ ని కంటిన్యు చేస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఐశ్వర్యకి డైరెక్టర్ గా ఇది నాలుగో సినిమా, ఇప్పటివరకూ ఆమె చేసిన ‘3’ మూవీకి మాత్రమే మంచి పేరొచ్చింది. మరి ఈసారి రజినీకాంత్ క్యామియో ఐశ్వర్య రజినీకాంత్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.
