NTV Telugu Site icon

Jayasudha: కమల్ హాసన్ తో పెళ్లి.. నా దగ్గర ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే అస్సలు ఊరుకోను

Jayasudha

Jayasudha

Jayasudha: సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి, జయప్రద లాంటి గ్లామర్ హీరోయిన్స్ మధ్య సహజనటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన జయసుధ.. పెళ్లి తరువాత కూడా నటిస్తూ వస్తుంది. హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. గతేడాది ఆమె అనారోగ్యానికి గురికావడం, విదేశాల్లో చికిత్స తీసుకొని రావడం జరిగాయి. ప్రస్తుతం జయసుధ ఆరోగ్యం కుదుటపడింది. ఇక ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె యాంకర్ పై ఫైర్ అయ్యింది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పను అని, ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు చెప్పమనడం ఏంటి అని ఫైర్ అయ్యింది. అంతేకాకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని తెలిపింది.

మీ కెరీర్ లో కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేశారు. అప్పట్లో ఆయనతో మీకు పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై మీరు ఏమంటారు అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు జయసుధ మాట్లాడుతూ.. ” అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు.. ? ఇప్పుడు కమల్ తో పెళ్లి గురించి అడగడం అవసరమా.. ? అప్పట్లో బాలచందర్ తీసిన సినిమాల్లో కమల్ తో పాటు నటించాను. కమల్ సాంగ్స్ బాగా పాడతారు. ఆయనతో పాటు నేను కూడా పాడేదాన్ని. అందరూ మమ్మల్ని జంటగా ఉంటే బావుంటుంది అనుకున్నారు. అలానే ఉండాలని కోరుకున్నారు. అప్పట్లో ఈ విషయాన్ని కొన్ని తమిళ్ పేపర్లు రాశాయి. మీడియావాళ్లకు ఏదో ఒకటి రాయడమే కదా పని.. దీనివలన తప్పుడు ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే.. ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అనే అనుకుంటా.. హీరోయిన్లు ఇంటర్వ్యూలకు రావడం లేదు. మీరు నాకు బాగా తెలుసు కాబట్టి ఏమి అనలేకపోతున్నాను. నేను గొప్ప నటిని అన్నందుకు హ్యాపీ.. కానీ, ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పను.. అస్సలు ఊరుకోను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.