Site icon NTV Telugu

‘జయమ్మ పంచాయితీ’ కి రండి చూసుకుందాం అంటున్న సుమక్క

స్టార్ యాంకర్ సుమ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బుల్లితెరపై తన సత్తాచాటిన సుమక్క వెండితెరపై కూడా తన సత్తా చాటనుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విదుదల చేశారు. ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో సుమ పల్లెట్టూలో ఊరి పెద్దగా కనిపించింది. ఇక చుట్టూ వేర్వేరు కథలను చూపించారు. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి రావాల్సిందే అన్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మరి వెండితెరపై సుమక్క హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version