Jawan Telugu To Telecast in Zee telugu on this Sunday: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఛానల్ ఈ వారం బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా జవాన్‌ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్,మార్చి 17 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన జవాన్ సినిమా కథ సమాజంలోని దురాచారాలను ఎదుర్కోవడానికి విషయాలను తన చేతుల్లోకి తీసుకునే భారత సైనికుడు షారుఖ్ ఖాన్ పోషించిన విక్రమ్ రాథోడ్ చుట్టూ తిరుగుతుంది.
Heroines: సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ వీరే..
ఒక మెట్రో రైలును తన ఆధీనంలోకి తీసుకొని, ఆయుధ వ్యాపారి ఖాళీ గైక్వాడ్‌కు వ్యతిరేకంగా చేసే న్యాయపోరాటం ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో నయనతార ఎన్ఎస్జీ ఆఫీసర్ నర్మద పాత్రలో నటించారన్న సంగతి తెలిసిందే. ఇక జవాన్ సినిమా భావోద్వేగాలతో కూడిన తండ్రీకొడుకులకథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ ఎనర్జిటిక్ మ్యూజిక్, షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, సునీల్ గ్రోవర్, గిరిజా ఓక్ వంటి ప్రముఖ నటీనటుల అద్భుతమైన నటనతో రూపొందిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది.