NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీక్వెన్స్ గురించి ముందు నుంచి మేకర్స్ ఒక రేంజ్ లో హైపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ముందు నుంచి ఈవెంట్స్ కూడా వ్యూహాత్మకంగా ఆసక్తికరంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అలా ఒక ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంప ముంచాయి.

Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?

ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు నమోదయ్యేలా చేశాయి. తాజాగా అల్లు అర్జున్ మీద హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పుష్ప 2 హీరోపై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ మీద గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ క్లబ్‌కి ‘అర్జున్ ఆర్మీ’ అని పేరు పెట్టాడని గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. “జాతి సేవకు ప్రాణాలు అర్పించే గౌరవప్రదమైన ఆర్మీ పేరు మీద నటుడు తన అభిమానుల సంఘం పెట్టడం చాలా అభ్యంతరకరం అని పేర్కొన్నారు. ఆర్మీ అనేది జాతీయ సమగ్రత మరియు జాతీయ భద్రతకు సంబంధించిన విషయం, కానీ అల్లు అర్జున్ తనకు చాలా మందిపై సైన్యం ఉందని ప్రకటించాడు. కాబట్టి ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Show comments