Jaragandi Jaragandi Song is also a Copy tune byt Thaman Says Netizens: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తెలుగులో సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి ఈ సాంగ్ కాపీ ట్యూన్ అని గతంలోనే ఇలాంటి ట్యూన్ తో కొన్ని సాంగ్స్ ఉన్నాయని తెలుగు నెటిజన్లు కనిపెట్టి థమన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జరగండి జరగండి సాంగ్ వింటుంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమాలోని సుర్రో సుర్రా అనే సాంగ్ ట్యూన్ విన్నట్టు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు జరగండి సాంగ్ తో పాటు ఆ సాంగ్ వీడియో కూడా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శక్తి సినిమాలోని అన్ని పాటలకు సంగీతం అందించింది మణిశర్మ. ఆయన శిష్యుడిగానే థమన్ గతంలో పనిచేసేవాడు. తర్వాత స్వతంత్ర మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన తర్వాత ఇప్పుడు తమ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గురువైన మణిశర్మ తనకు అవకాశాలు లేవని గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు నెటిజన్లు. తన గురువు సాంగ్ ట్యూన్ ని కాపీ కొట్టి తమన్ ఏమో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు, అయితే అదే గురువు అవకాశాలు లేక అవకాశాలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి శక్తి సినిమా మ్యూజిక్ కి థమన్ ప్రోగ్రామర్ గా కూడా వ్యవహరించారు. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
