Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని అధికారికంగా సినిమా యూనిట్ చెప్పింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖండంతరాలు దాటింది. బాహుబలి సినిమా విదేశాల్లో సైతం రిలీజ్ కావడంతో జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కల్కి రిలీజ్ అయిన మొదట్లోనే కొందరు జపాన్ దేశీయులు ఈ సినిమా చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. ప్రసాద్ ఐమాక్స్లో కల్కి సినిమా చూసి అక్కడే ఉన్న బుజ్జి కార్ తో ఫోటోలు సైతం దిగారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
Also Read: English Teacher: తనపై రేప్ జరిగిందన్న ఇంగ్లీష్ టీచర్.. 19 ఏళ్ల యువకుడి ఆత్మహత్య..
అల్లు అర్జున్ కి చెందిన థియేటర్ కి సుమారు 25 మంది జపాన్ దేశీయులు వచ్చి థియేటర్లో ఉన్న కల్కి కటౌట్ తో ఫోటోలు దిగడమే కాక అల్లు అర్జున్ స్పెషల్ కలెక్షన్లో ఉన్న వస్తువులతో కూడా ఫోటోలు దిగుతూ కనిపించారు. వీరంతా కల్కి సినిమా కోసమే హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఏదైనా ట్రిప్ మేరకు హైదరాబాద్ వచ్చి కల్కి సినిమా చూసేందుకు వచ్చి ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం మీద జపాన్ దేశీయులను పలకరించే ప్రయత్నం చేస్తే తాము హైదరాబాద్ సైట్ సీయింగ్ కోసం వచ్చామని అందులో భాగంగానే అల్లు అర్జున్ థియేటర్ సైతం వీక్షించేందుకు ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. తమలో కొంతమంది కలికి సినిమా చూశామని మరి కొంతమంది ఈరోజు రేపట్లో వీక్షిస్తామని వెల్లడించారు.