NTV Telugu Site icon

Bro-RRR: బ్రో రిలీజ్ రోజునే ట్రెండింగ్లో ఆర్ఆర్ఆర్.. ఎందుకో తెలుసా?

Rrr Trendnig On Bro Release Day

Rrr Trendnig On Bro Release Day

RRR in Trending on Bro Release Day: ఒకపక్క పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే అది ఒకపక్క ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఈ మధ్య జపాన్ దేశంలో విడుదలై సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి ఫాన్స్ ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు బ్రహ్మరథం పట్టగా వారిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులలో ఒకరిగా మారిపోయారు జపాన్ మంత్రి యోషిమాసా.

Janhvi Kapoor: బ్లూ లెహంగాలో జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్టీఆర్ఆర్ అభిమానిని అని, తనకు ఆయనంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఇండియన్ మూవీస్ కు జపాన్ దేశంలో మంచి గుర్తింపు వస్తోందన్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్‌ను జపాన్ ప్రజలు ఎంతగానో అభిమానించారని చెబుతుండగా ఆర్ఆర్ఆర్‌లో మీకు ఏ హీరో నచ్చారు? అంటూ ప్రశ్నించగా అందుకు జపాన్ మంత్రి సమాధానమిస్తూ ‘రామారావు జూనియర్ నా అభిమాన హీరో’ అని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇక గత ఏడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సుమారు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.