Site icon NTV Telugu

Janhvi Kapoor : భూమ్మీద ఉగ్రవాదులు ఉండకూడదు.. జాన్వీకపూర్ పోస్ట్

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor : పాకిస్థాన్-భారత్ యుద్ధ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతున్నారు. జాన్వీకపూర్ ఇప్పటికే వరుసగా పోస్టులు పెడుతూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తోంది. తాజాగా యుద్ధ వాతావరణం గురించి సుదీర్ఘ పోస్టు పెట్టింది. ‘ఇన్ని రోజులు మనం యుద్ధం రావొద్దనే కోరుకున్నాం. కానీ టెర్రరిస్టుల మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. ఇండియా ఎన్నడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడులను తిప్పి కొడుతున్నాం. కానీ దశాబ్దాల బాధ ఇప్పుడు పెరిగింది.

Read Also : IMF: పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ నిధులు విడుదల

ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం. టెర్రరిస్టులు అనే వారు భూమ్మీద ఉండటానికి వీళ్లేదు. మన సైనికులు బార్డర్ దగ్గర పోరాడుతూ మనల్ని కాపాడుతున్నారు. మన దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుతున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి. వాళ్ల వల్లే మనం సేఫ్ గా ఉంటున్నాం. ఇలాంటి టైమ్ లో దేశమంత మన ఇండియన్ ఆర్మీకి మద్దతు నిలవాలి. ఎలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయొద్దు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Read Also : India-Pakistan War: మరో తెలుగు జవాన్‌ వీరమరణం..!

Exit mobile version