Jani Master: డ్యాన్సర్ ఆరోపణలు.. పాటలు వినను, కొరియోగ్రఫీ కూడా చేయను.. జానీ మాస్టర్ సంచలనం
- సతీష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా
- జానీ మాస్టర్ సెన్సేషనల్ ప్రెస్‌మీట్
- నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు :జానీ మాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Responds to Allegations of Dancer Satish: జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూ మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అందులో జానీ మాస్టర్ మీద పలు ఆరోపణలు చేశారు. అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్ చెప్పారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ… ”ఇక్కడ నేను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా, మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో ఐదు కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నాం, అది సమస్యల్లో చిక్కుకున్నది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు. నేను అధ్యక్షుడయ్యి ఆరు నెలలు అవుతోంది.
Kalki 2898 AD: అందరి కళ్ళు కల్కి మీదే.. ఇదెక్కడి క్రేజ్ మావా?
Also Read
ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది, ఆ సమయంలో నేను పాటలు వినను, కొరియోగ్రఫీ కూడా చేయను ఆ నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసనతో మాట్లాడా, యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం, పలు పనులు చేశాం. సతీష్ విషయానికి వస్తే అయేషా చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారం కమిటీ, కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతనికి లక్ష రూపాయలు ఫైన్ విధించారు. మా అసోసియేషన్‌లో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను డబ్బులు ఇచ్చా, ఒకరి పొట్ట కొట్టాలని అనుకోను. సతీష్ గనుక తప్పు అయ్యిందని లెటర్ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేవాళ్ళం, ఫైన్ వేసేవాళ్ళం కాదు అతను నేను ఏంటో చూపిస్తానని కొందరిని బెదిరించారు. ఈ నాలుగు నెలల్లో కొన్ని పాటలు కూడా చేసి నా మీద ఆరోపణలు చేశారు. సతీష్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఒక్కటి నిజమైనా సరే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా, నేను ఒక చోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా ఉన్నాను. నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు. నా తరఫునుంచి తెలంగాణకు ఇబ్బంది రాకూడదు. అందుకే, ఈ ప్రెస్ మీట్ పెట్టాను” అని చెప్పారు.
జానీ మాస్టర్ భార్య అయేషా మాస్టర్ మాట్లాడుతూ ”జనరల్ బాడీలో విషయాలు నోటీసు బోర్డులో పెట్టిన తర్వాత ఎవరైనా బయటకు చెప్పాలి. కానీ, అతను లీక్ చేశాడు. అతని స్టేటస్ జానీకి చూపించాను. ఆయన కమిటీ సభ్యులకు ఫోన్ చేసి తీయమని చెప్పమన్నారు అప్పుడు అతను జానీకి ఫోన్ చేసి బూతులు తిట్టారు. నా భర్తను తిట్టారని కాదు ఒక కొరియోగ్రాఫర్, యూనియన్ అధ్యక్షుడిని తిట్టడం కరెక్ట్ కాదు. అందుకే, రెండో రోజు కమిటీ మీటింగ్ పెట్టారు. తప్పు చేశానని సతీష్ ఒప్పుకొని ఫైన్ కట్టడానికి నిరాకరించాడు. గతంలో జానీ మాస్టర్ తప్పు చేయకున్నా ఫైన్ వేస్తే లక్ష కట్టి వర్క్ చేసుకున్నారు. పదేళ్ల క్రితం నాన్ యూనియన్ మెంబర్లను తీసుకుని కొందరు షూటింగ్ చేస్తున్నారని తెలిసి జానీ మాస్టర్ వెళ్లి మాట్లాడారు. అందువల్ల 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. యూనియన్ కోసం, యూనియన్ సభ్యుల కోసం ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి మీద సతీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని, ఐదు- పది వేలు ఇస్తామని సతీష్ దంపతులు కొందరికి ఫోన్లు చేస్తున్నారు. మా యూనియన్ టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది తప్ప తెలంగాణ ఆంధ్ర బేధాలు చూడదు” అని చెప్పారు.
- Tags
- Dancer Satish
- Jani Master
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!