Site icon NTV Telugu

Jani Master: జానీ మాస్టర్ మంచి మనసు.. దైవ కార్యమే కదా అంటూ పోస్ట్!

Jani Master

Jani Master

Jani Master joins accident victims in Hospital: సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఈ మధ్య జనసేన తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు. ఒక పక్క షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో పక్క పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరిగి వెళ్తుండగా విజయవాడ బెంజ్ సర్కిల్, కరకట్ట వద్ద వేరు వేరు ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇక గాయాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా అక్కడున్న వారు, ఆఖరికి పోలీసు అధికారులు కూడా అంబులెన్స్ ల కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనించానని ఆయన అన్నారు.

Allu Arjun: బన్నీకి అరుదైన గౌరవం.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమాలకు ప్రాతినిధ్యం

వెంటనే స్పందించి వారికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి వైద్యం కోసం తరలించామని ఆయన అన్నారు. ఆపద సమయంలో సాయం అందించడం కూడా దైవ కార్యమే కదా అని అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక జానీ మాస్టర్ నెల్లూరు జిల్లా నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన టీడీపీ -బీజేపీ పొత్తుతో పోటీకి దిగుతూ ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారా? ఇస్తే ఎక్కడ ఇస్తారు? అనే అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవలే పొలిటికల్ యాక్టివిటీ పెంచిన జానీ మాస్టర్ పలువురు వైసీపీ నేతల మీద కూడా ఫైర్ అవుతూ మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేస్తున్నారు.

Exit mobile version