Site icon NTV Telugu

Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!

Jani Master On Rave Party

Jani Master On Rave Party

Jani Master Clarity on Bengaluru Rave Party Case: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. నటుడు శ్రీకాంత్ కూడా పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా దానికి శ్రీకాంత్ ఏకంగా ఒక వీడియో రికార్డు చేసి క్లారిటీ ఇచ్చారు. తాను తన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కూడా బెంగళూరు రేవ్ పార్టీ భగ్నం చేస్తున్న సమయంలో పోలీసులు షూట్ చేసిన వీడియోలో కనిపించాడు. దీంతో అది జానీ మాస్టర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

Hema: హేమ రేవ్ పార్టీ వ్యవహారంలో ట్విస్ట్.. ఆ వీడియోతో అడ్డంగా బుక్కయ్యిందిగా?

పూర్తిగా ముఖం కనబడకపోయినా ముఖాన్ని దాచుకుంటున్న వ్యక్తి పోలికలు జానీ మాస్టర్ పోలికలు కాస్త దగ్గరగా అనిపించడంతో జానీ మాస్టర్ ఈ రేవ్ పార్టీలో దొరికాడు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపద్యంలో జానీ మాస్టర్ స్పందించాడు తన సోషల్ మీడియా వేదికగా తన మీద జరుగుతున్న ప్రచారం నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ‘’నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది’’ అని అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు.

Exit mobile version