Site icon NTV Telugu

Janhvi Kapoor: దేవర తోనే నా కెరీర్ మొదలవుతుంది.. ఎక్కించు పాప.. ఇంకా హైప్ ఎక్కించు

Devara

Devara

Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటుంది. ఇక నిన్న.. ట్విట్టర్ లో హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించిన జాన్వీ.. నేడు తిరుపతిలో స్వామివారి దర్శనమ్ కోసం అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి షాక్ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిన్నది.. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మధ్య.. కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పి హైప్ ఎక్కించాడు. మునుపెన్నడూ లేని విధంగా దేవర ఉండబోతుంది అని, రికార్డులు గల్లంతే అని చెప్పుకొచ్చాడు. దీంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇక జాన్వీ కూడా తనదైన రీతిలో సినిమాపై హైప్ పెంచుతుంది. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. దేవర గురించి మాట్లాడింది. “దేవర సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ వర్క్ షాప్స్ లా అనిపించాయి. ఇప్పుడే హీరోయిన్ అనే ఫీల్ వస్తోంది. నా అసలు కెరీర్ దేవరతోనే మొదలవుతుంది” అని చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ ఈ రేంజ్ లో చెప్పింది అంటే.. అమ్మడికి కొరటాల మంచి పాత్రనే ఇచ్చి ఉంటాడు అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో జాన్వీ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version