NTV Telugu Site icon

Janhvi Kapoor: అని వదిలేసి హాయిగా పెళ్లి చేసుకుని..అక్కడే సెటిల్ అవ్వాలని ఉంది : జాన్వీ కపూర్

Jhanvi

Jhanvi

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో, అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్‌లో జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. తెలుగు, హిందీ తేడా లేకుండా నటిస్తుంది. తారక్ తో ‘దేవర 2’ , ‘ఆర్సీ 16’ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే జాన్వీ ఎక్కువగా తిరుమల వెళుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కాస్త సమయం దొరికితే చాలు శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోతుంది. అంత బిజీ కెరీర్ లీక్ చేస్తున్న జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షో లో పాల్గొన జాన్వీ మాట్లాడుతూ.. ‘తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి.. పెళ్లి చేసుకొని తిరుమలలో భర్త, ముగ్గురు పిల్లలతో హాయిగా గడపాలి, ప్రతి రోజూ అరటి ఆకులో అన్నం తింటూ, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపింది. ఇక జాన్వీ మాటలు విన్న కరణ్ జోహార్‌కు ఏం అర్ధం కానట్టుగా మోకం పెట్టాడు. ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో .. శ్రీదేవి కూతురు అనిపించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా అనడంతో అసంతృప్తి వ్యకం చేస్తున్నారు.