Janhvi Kapoor Reacts On Trolls: బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై ట్రోల్స్ అనేవి సర్వసాధారణం. బ్యాక్‌గ్రౌండ్ కారణంగా సినీ పరిశ్రమలో సునాయాసంగా వచ్చేస్తారు కాబట్టి, ట్రోలర్స్ వాళ్లని టార్గెట్ చేస్తారు. ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తూ కనిపిస్తే చాలు, దాన్ని అడ్డం పెట్టుకొని నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిపారేస్తారు. జాన్వీ కపూర్‌ని అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏమైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా.. వాటిల్లో వంకలు వెతికి మరీ విమర్శలు గుప్పిస్తుంటారు. సినిమాల కన్నా ట్రోల్స్‌తోనే జాన్వీ ఎక్కవగా హైలైట్ అవుతోందంటే.. అక్కడి జనాలు ఆమెని ఎంతలా ద్వేషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. తాను ఇలా ట్రోల్స్‌కి గురవ్వడంలో తన తప్పు ఏమీ లేదని, నిర్మాత కరణ్ జోహార్ వల్లే తనని ద్వేషిస్తున్నారని జాన్వీ కపూర్ తాజాగా బాంబ్ పేల్చింది. తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా కరణ్ జోహార్ తనని లాంచ్ చేయడం వల్లే.. తనపై ఇంత ద్వేషం చిమ్ముతున్నారని అమ్మడు వాపోయింది. ‘‘ధర్మ ప్రొడక్షన్స్ ఒక గొప్ప నిర్మాణ సంస్థ. అదే నన్ను కథానాయికగా సినీ పరిశ్రమలో లాంచ్ చేసింది. బహుశా ఇదే నాపై ట్రోలింగ్‌కు కారణమని నేను భావిస్తున్నా. ఆ ప్రొడక్షన్స్ సంస్థ నన్ను ద్వేషించేందుకు ఓ మార్గాన్ని కల్పించింది. నాపై వస్తున్న ట్రోల్స్ చూసి నేను మొదట్లో ఒత్తిడికి లోనయ్యాను కానీ, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పని చేసినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా. ఎందుకంటే.. కరణ్ జోహార్, అతని ధర్మ ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి ఎవ్వరికీ తెలీదు. అన్నింటికీ మించి కరణ్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది’’ అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
స్టార్ కిడ్స్ మినహాయిస్తే.. బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ప్రోత్సాహించదని బాలీవుడ్‌లో ఒక అపవాదు ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొనే.. జాన్వీ పై విధంగా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న ట్రోల్స్‌కి కరణ్ జోహార్‌ని బాధ్యుడ్ని చేసింది.
