నెపోటిజం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంటాయి. బయట నుంచి వచ్చిన హీరోలు గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికి తెలుసు. కానీ స్టార్ కిడ్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ప్రేక్షకుల ఆదరణ పోదటం అంత సులువైన పని కాదు. అయితే ఇలాంటి కష్టాలు చెప్పుకున్న ఎవరు వినరు అని తాజాగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
Also Read : Danush : ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు..రికార్డ్ స్పీడ్‌లో ధనుష్
‘ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్’ అనే చర్చలో పాల్గొన్న జాన్వీ, నటీనటులను ఇండస్ట్రీ నుంచి వచ్చినవారు, బయట నుంచి వచ్చినవారుగా విభజించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ‘‘బయటివారికి పరిశ్రమలో కష్టాలు ఎదురయ్యేలా ఉంటాయి. మనిషి అవన్నీ తట్టుకుంటాడు. కానీ స్టార్ కిడ్స్‌కి కూడా ఇబ్బందులు ఉంటాయి, అది బయట ఎవరికీ కనిపించదు. మన కష్టాలను బయటకు చెప్పినా, ఎవరూ నమ్మరు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇలాంటప్పుడు స్టార్ కిడ్ అయిన మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఎందుకంటే మనకు లభించిన సౌకర్యాలు ఇతరులకు అందవు’ అని జాన్వీ వివరించారు. మనం అనుకుంటూ ఉంటాం నటీనటుల పిల్లలకు ఈజీగా అవకాశాలు వస్తాయి అని కానీ దాని వెనుక చాలా కష్టం కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది జాన్వీ పాప..
