Site icon NTV Telugu

Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్

Janvi Kappor

Janvi Kappor

Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వరుస హిట్లు అందుకుంటోంది. ఆమె సినిమాల్లో స్టార్ గా ఉంటూనే.. చాలా విషయాలపై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తుంది. తాజాగా పీరియడ్స్ పెయిన్ పై మాట్లాడింది. ‘అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారు. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్ సింగ్స్ వేరేలా ఉంటాయి. అందుకే నేను మాట్లాడే విధానాన్ని బట్టి చాలా మంది ఇది నీకు ఆ సమయమా అని అడుగుతారు’ అంటూ తెలిపింది.
Read Also : Shine Tom Chako: షాకింగ్.. డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్

‘అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ చాలా బాధగా ఉంటుంది. దాన్ని కొందరు చులకనగా చూస్తారు. ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ బాధను తట్టుకోలేరు. అప్పుడు మా బాధ ఏంటి అనేది వారికి అర్థం అవుతుంది. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే కచ్చితంగా అను యుద్ధాలే జరిగేవి’ అంటూ జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అబ్బాయిలపై ఇలాంటి కామెంట్లే చేసింది జాన్వీ.. హీరోయిన్ అంటే కేవలం సినిమాలే చేస్తే సరిపోదని.. సొసైటీలో జరిగే విషయాలపై స్పందించాలి అంటూ చెప్తోంది జాన్వీకపూర్. ప్రస్తుతం రామ్ చరణ్‌ తో చేస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version