Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దగుమ్మ దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. అమ్మడు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఈ బ్యూటీ ఈసారి మరింత హాట్ లుక్ లో కనిపించి షేక్ చేసింది. జాన్వీ తాజాగా ఎల్లే మ్యాగజైన్ కవర్ పై మెరిసింది. జాన్వీకి మ్యాగజైన్ కవర్స్ పై మెరవడం కొత్తేమి కాదు. ఇప్పటివరకు ఈ బ్యూటీ బ్రైడల్ లుక్ లో కనిపించింది.. జిమ్ వేర్ లో కనిపించింది.. బికినీ తో సహా ఎన్నో కవర్ పేజిస్ పై కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఎల్లే మ్యాగజైన్ కవర్ పై సరికొత్తగా మెరిసింది.
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జాకెట్ లేకుండా చీరను కట్టుకుంటారు. అలా జాన్వీ కూడా జాకెట్ లేకుండా చీరను కట్టుకొని కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ చీరలో జాన్వీ ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటోషూట్ కోసం ముద్దుగుమ్మ మూడు చీరల్లో దర్శనమిచ్చింది. మూడు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కలర్ చీరపై పొడవైన జుట్టుతో జడ వేసుకొని చేతులు పైకి పెట్టి వయ్యారంగా నడుము చూపిస్తూ కనిపించింది. అసలు ఈ అందానికి ఫిదా కానివారు ఉంటారా.. ? అనేంతగా జాన్వీ మెరిసిపోయింది. దేవుడా.. ఏంటి జాన్వీ ఈ అరాచకం అని కామెంట్స్ పెడుతున్నారు. మరి దేవర సినిమాతో జాన్వీ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
