Site icon NTV Telugu

Vijay 69 : జననాయకుడు ఫస్ట్ రోర్ రిలీజ్..

Vijay

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినీకెరీర్ లో జన నాయకుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో రాబోతున్న చివరి సినిమా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.

కాగా జన నాయకుడు ఫస్ట్ రొర్ ను నేడు విజయ్ బర్త్ డే కానుకగా రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసారు మేకర్స్. ఏమాటకామాట జన నాయకుడు రోర్ ఆదరిందనే చెప్పాలి. వింటేజ్ లుక్ లో పోలిస్ డ్రెస్ లో విజయ్ అదరగొట్టాడు. దానికి తో అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. అలాగే  సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తానికి చాలా రోజులుగా విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న జననాయకుడు వారి అంచనాలను అందుకుంది. విజయ్ ఫ్యాన్స్ కు సరైన బర్త్ ట్రీట్ ను అందించాడు దర్శకుడు హెచ్ వినోద్.  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయకుడు 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Exit mobile version