Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్

Jananayagan (2)

Jananayagan (2)

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో సరికొత్త చర్చ నడుస్తోంది. గత 7 నెలలుగా ఈ చిత్రం సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానుందని ఆ వెంటనే హిందీ, తెలుగు వెర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సెన్సార్ సమస్యలు వీడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాను జూలై 16 లేదా జూలై 23న థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఈ విండోలో పలు క్రేజీ చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. జూలై 17న ‘అన్బే డయానా’, జూలై 23న ‘మకుటం’, ‘ఇమ్మోర్టల్’, అలాగే జూలై 31న ‘డిసి’, ‘సిగ్మా’ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ దళపతి విజయ్ రేసులోకి వస్తే ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన ఆయా చిత్రాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే  సెన్సార్ A సర్టిఫికెట్ ఇస్తే చిన్న పిల్లలు ఈ సినిమా చూసేందుకు అనుమతించరు. తమ హీరో సినిమాను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దళపతి చివరి చిత్రం కావడంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్ల వద్ద జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.