దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జననాయగన్ . H. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. విజయ్ కెరీర్ లో 69వ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read : NBK : జైలర్ 2 కోసం బాలయ్య అంత తీసుకున్నాడా..?
తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన ఓ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో విజయ్ పోలీస్ డ్రెస్ లో ధరించి ఎదో యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నట్టు ఉన్నారు. అయితే ఈ లీక్ అయిన ఫోటోను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విజయ్ అట్లీ కాంబోలో వచ్చిన తేరి సినిమాలోని విజయ్ కుమార్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమా తెలుగులో వచ్చిన బాలయ్య హిట్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని టాక్ కూడా ఉంది. అందులోను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య కాప్ రోల్ లో కనిపిస్తాడు. ఇప్పుడు జననాయగన్ లీక్డ్ పిక్ ఆ రీమేక్ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మళయాళ భామమమితా బైజు ఈ చిత్రంలో విజయ్ కూతురిగా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగన్ ను 2026 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
