Jan 25th: ఒకే టికెట్ పై రెండు సినిమాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒకే రోజు రెండు సినిమాలని చూపించడానికి షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు రెడీ అయ్యారు. స్టాల్ వార్ట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ అవుతుందనే విషయం తెలుసు కానీ సల్మాన్ ఖాన్ సినిమాలేవీ రిలీజ్ కి లేవే అని ఆలోచిస్తున్నారా. షారుఖ్ ‘పఠాన్’ మూవీలోనే సల్మాన్ ఖాన్ ఒక ఎక్స్టెండేడ్ క్యామియో రోల్ ప్లే చేస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగమైన ఇండియన్ స్పై ‘టైగర్’గా సల్మాన్ ఖాన్, పఠాన్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లోని టైగర్ క్యారెక్టర్ ని మంచి ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ ఖాన్ క్యామియో ప్లే చెయ్యడం పఠాన్ సినిమాకి కలిసొచ్చే విషయం.
షారుఖ్, సల్మాన్ ఖాన్ లు కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ. ఇది మాత్రమే కాదు జనవరి 25న ఆడియన్స్ ని మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు సల్మాన్ ఖాన్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డేలు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ టీజర్ ని పఠాన్ మూవీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ఇంటర్వెల్ లో ప్లే చేస్తున్నారు. అంటే జనవరి 25న థియేటర్ కి వెళ్తే పఠాన్ సినిమాలో షారుఖ్, సల్మాన్ ల యాక్షన్ తో పాటు ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ టీజర్ ని కూడా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు అన్నమాట. ఇప్పటివరకూ పఠాన్ సినిమా బుకింగ్స్ ఒక రేంజులో ఉంటే… సల్మాన్ ఖాన్ టీజర్ అనౌన్స్మెంట్ తో పఠాన్ బుకింగ్స్ మరింత పెరగనున్నాయి. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ టీజర్ ని స్క్రీన్ పైన చూడడానికి టికెట్స్ బుక్ చేసుకునే వాళ్లు ఎక్కువగా ఉండడం షారుఖ్ ‘పఠాన్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని మరింత పెంచానున్నాయి.
Also Read
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
#KisiKaBhaiKisiKiJaan Teaser ab dekho bade parde par on 25th Jan…@VenkyMama @hegdepooja @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii #VinaliBhatnagar @farhad_samji @ShamiraahN pic.twitter.com/pbVSce3xYH
— Salman Khan (@BeingSalmanKhan) January 23, 2023
తాజావార్తలు
-
CP Mahesh Bhagwat: “అదే నా మొదటి ప్రాధాన్యత”.. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
-
IND vs NZ 4th ODI: టీమిండియాకు వరుస షాక్స్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు స్టార్ బ్యాటర్లు డకౌట్!
-
Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!