Jamie Lever to Make Telugu Film Debut with ‘Aa Okatti Adakku’: బాలీవుడ్ స్టార్ కమెడియన్, తెలుగు వాడైన జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన నాన్నమ్మకు హృదయపూర్వక నివాళిగా ఈ సినిమాలో ఆమె నటించడానికి సిద్ధమైంది. జామీ మాతృభాష తెలుగు కావడంతో ఈ సినిమా తనకి స్పెషల్ అని ఆమె అంటోంది. ఈ సినిమా గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జామీ “తెలుగు పరిశ్రమలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో నా అరంగేట్రం చేయడంతో ఒక కల నిజమైంది. ఈ సినిమా నాకు వృత్తిపరమైన ప్రయాణం మాత్రమే కాదు; ఇది నా మూలాలకు వ్యక్తిగతంగా నివాళి. నా మాతృభాషలో నేను సినిమా చేయడం మా నాన్నమ్మకు నేను ఇచ్చే హృదయపూర్వక నివాళి, ఆమె తన మాతృభాషను అర్థం చేసుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అని అన్నారు.
Vedhika: వేదిక లీడ్ రోల్ లో సస్పెన్స్, థ్రిల్లర్ “ఫియర్”
ఛోటా భీమ్ నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రంలో జామీ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు ఆమె . ఇక తెలుగు పరిశ్రమలో జామీ అరంగేట్రం కోసం అంచనాలు పెరుగుతుండగా, ఆమె కూడా అంతే ఉత్సాహంతో ఉంది. “నా సౌత్ సినీ ఎంట్రీ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. తెలుగు కేవలం భాష కాదు, ఇది నా గుర్తింపులో భాగం. ప్రేక్షకులు నన్ను చూసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కొత్త వెలుగులో, తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటిచెబుతోంది అంటూ ఆమె పేర్కొన్నారు.