Site icon NTV Telugu

James Cameron: రాజమౌళిపై అవతార్ డైరెక్టర్ ప్రశంసలు.. ఇది కదరా అసలైన కిక్కు అంటే

Raja

Raja

James Cameron: తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2022 లో మార్చి 24 న రిలీజ్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు కలక్షన్స్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి పనితనానికి ఫిదా అయిపోయారు. ఆర్ఆర్ఆర్ చూసాకా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం జక్కన్న పై ప్రశంసలు కురిపించడం జరిగింది. రాజమౌళి వర్క్ కు తాను మంత్రం ముగ్దుడ్ని అయ్యినట్లు జేమ్స్ చెప్పుకొచ్చాడు. అవతార్ లాంటి సినిమా తీసిన డైరెక్టరే.. రాజమౌళి గురించి తెలుగు సినిమా గురించి చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోసారి జేమ్స్ కామెరూన్.. రాజమౌళి పనితనాన్ని ప్రశంసించాడు.

తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ కామెరూన్ కు ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. గతేడాది మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడారు.. దాని గురించి చెప్పండి అన్న ప్రశ్నకు.. జేమ్స్ మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్ప విషయం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించింది. జేమ్స్ కామెరూన్ తమకెప్పుడు ఆదర్శమని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇది కదరా అసలైన కిక్కు అంటే .. హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ ను చూసి ప్రశంసించాలి అని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version