సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. సౌత్ ఇండియా మొత్తం 50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన మొదటి తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్ సినిమా, థియేటర్స్ లో ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ఫుల్ చేస్తుండగానే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలోకి తీసుకోని వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో జైలర్ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీని ఓటీటీలో చూసిన వాళ్లు జైలర్ సినిమా ఓవర్ రేటెడ్ అనే కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ సినిమాలో అసలు ఏముంది? రజినీ స్లో మోషన్ షాట్స్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప… మిగిలింది అంతా ట్రాష్, భయంకరమైన లాగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ లో కాబట్టి ఎదో చూసేసాం కానీ నెల్సన్ అసలు ఎంగేజింగ్ గా లేకుండా ఇలాంటి సినిమా ఎలా చేసాడు? దీనికి 600 కోట్లు ఎలా వచ్చాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే… జైలర్ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తెరకెక్కించారు. అది ఆడిటోరియంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తేనే నచ్చుతుంది. అప్పుడు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ స్వాగ్, నెల్సన్ మేకింగ్ విలువ ఏంటో తెలుస్తుంది. లార్జ్ స్క్రీన్ పైన చూడాల్సిన సినిమాని ఇంట్లో కూర్చోని టీవీలో పాజ్ అండ్ ప్లే మోడ్ లో చూస్తే జైలర్ ఎప్పటికీ నచ్చదు.
