Site icon NTV Telugu

Thalapathy Vijay: జైలర్ దెబ్బకి లియో రీషూట్… లోకేష్ హిస్టరీలోనే మొదటిసారి

Thalapathy Vijauy

Thalapathy Vijauy

గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ… కాన్స్టాంట్ గా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఒకప్పుడు ఇళయదళపతి విజయ్ గా ఉండే విజయ్, ఇప్పుడు దళపతి విజయ్ అయ్యాడు అంటే అతని రేంజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ హీరో, మిగిలిన హీరోలంతా విజయ్ తర్వాతే అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ కి ఒకడే స్టార్ హీరో… అతనే సూపర్ స్టార్ రజినీకాంత్ అని ప్రూవ్ చేస్తూ జైలర్ సినిమా సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో, కేవలం నాలుగో సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో 650 కోట్లని రాబట్టిన రజినీకాంత్… కోలీవుడ్ నంబర్ 1 విజయ్ అనే మాటకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ వేసాడు.

విజయ్, అజిత్, ధనుష్ ఇలా ఎంతమంది హీరోలైన సరే సెకండ్ ప్లేస్ లో పోటీ పడాల్సిందే కానీ నంబర్ 1 మాత్రం రజినీకాంత్ మాత్రమే అని మరోసారి నిరూపించింది జైలర్ సినిమా. ఆ లెక్క కరెక్ట్ కాదని నిరూపించాలి అంటే దళపతి విజయ్ లియో సినిమాతో జైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలి. లోకేష్ కనగరాజ్ కి ఉన్న ఇమేజ్, విజయ్ మార్కెట్, స్టెల్లార్ కాస్ట్ ఉన్న లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. కేవలం ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లియో మూవీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట ప్రకారం… లియో సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ని రీషూట్స్ చేస్తున్నారట. జైలర్ కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ లియోలో మార్పులు చేస్తున్నారని టాక్. లోకేష్ కనగరాజ్ కెరీర్ లోనే ఇలా రీషూట్స్ చేయడం, విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టడం ఇదే మొదటిసారి. మరి అంత కష్టపడి చేస్తున్న లియో మూవీ జైలే రికార్డులని బ్రేక్ చేస్తుందా? విజయ్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబడుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version