వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేప్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి… బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైజ్ చేసాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2కి హైప్ తెచ్చింది, ఆడియన్స్ ని థియేటర్స్ కి వచ్చేలా చేసింది. WKKB అనే ట్యాగ్ అన్ని రీజనల్ ఇండస్ట్రీలని కలిపేసింది. బాహుబలి 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1800 కోట్లు రాబట్టింది అంటే అది వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రమోషనల్ స్టంట్ కారణంగానే జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే మరోసారి జరగబోతుంది.
హనుమాన్ సినిమా హిట్ అనే మాట సాలిడ్ గా వినిపిస్తున్న టైమ్ లో “జై హనుమాన్” మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2025లో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది అని హనుమాన్ మూవీ ఎండ్ లో రివీల్ చేసాడు ప్రశాంత్ నీల్. ఈ రివీల్ చేసే సమయంలో హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చాడు. ఈ మాట ఏంటి? హనుమంతుడు రాముడికి చేసిన ప్రామిస్ ఏంటి అనేది తెలియాలి అంటే 2025 వరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే ఆ ప్రామిస్ ఏంటి అనేది ఇప్పుడు హనుమాన్ సినిమా చూసిన వారిలో హాట్ టాపిక్ అయ్యింది. ఇదే డౌట్ ని పబ్లిసిటీ కోసం వాడడం మొదలుపెడితే జై హనుమాన్ రిలీజ్ సమయానికి హ్యూజ్ బజ్ జనరేట్ అవుతుంది.