Site icon NTV Telugu

సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డు… తగ్గని “జై భీమ్” జోరు

jai-bhim

jai-bhim

2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊరట కలిగింది. ఇక డిసెంబర్ లో అయితే ఏకంగా సినిమాల పండగే ఉంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ 2020 లాగా ఈ సంవత్సరం కూడా చాలా చిత్రాలు డిజిటల్ గా రిలీజ్ అయ్యాయి. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే గూగుల్ ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో చోటు సంపాదించిన చిత్రాల జాబితాను పంచుకుంది.

Read Also : చిత్రసీమలో ‘అందరివాడు’ సి.కళ్యాణ్

ఆ లిస్ట్ లో సౌత్ యాక్టర్ సూర్య నటించిన “జై భీమ్” టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా జోరు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ మూవీ నామినేషన్స్ లోకి సూర్యను రెండవ సారి అడుగుపెట్టేలా చేసింది. 2020లో సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” చిత్రం మొదటిసారి గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో నిలిచింది. ఇప్పుడు సూర్య “జై భీమ్” గూగుల్ సెర్చ్ 2021లోనూ టాప్ ప్లేస్ లో నిలిచి సూర్య ఖాతాలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

Read Also : ‘భీమ్లా నాయక్’ రన్ టైమ్ లాక్.. ఎందుకో తెలుసా?

కాగా సిద్ధార్థ్ మల్హోత్రా “షేర్షా” రెండవ స్థానంలో, సల్మాన్ ఖాన్ నటించిన “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” మూడవ స్థానంలో నిలిచాయి. బెల్ బాటమ్, ఎటర్నల్స్, మాస్టర్, సూర్యవంశీ, గాడ్జిల్లా vs కాంగ్, దృశ్యం 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలు ఈ జాబితాలో ఉన్న ఇతర చిత్రాలు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా ఈ ఏడాది కొందరు సెలబ్రిటీల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. వారిలో ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, నటాషా దలాల్ ఉన్నారు.

Exit mobile version