కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా ‘జై భీమ్’. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమాకు జై కొడుతున్నారు. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను అధిగమించింది. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ తమిళ చిత్రం 9.6 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచింది.
Read Also : టికెట్ రేట్లపై కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం… అసలు విషయం ఇదే !
ఫ్రాంక్ డారాబోంట్ ‘ది షాశాంక్ రిడెంప్షన్’ 9.3 రేటింగ్‌తో రెండవ స్థానంలో ఉండగా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల క్లాసిక్ ‘ది గాడ్ ఫాదర్’ 9.2 రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’, పీటర్ జాక్సన్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’, క్వెంటిన్ టరాన్టినో ‘పల్ప్ ఫిక్షన్’, క్రిస్టోఫర్ నోలన్ ‘ఇన్‌సెప్షన్’ మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. ‘జై భీమ్’ తొంభైలలో తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందగా, అణగారిన వర్గాలకు న్యాయం అందించే న్యాయవాదిగా సూర్య కన్పించాడు.
