Site icon NTV Telugu

Jagapathi Babu: నా అభిమానులే ఇబ్బంది పెడుతున్నారు.. జగపతి బాబు సంచలన ప్రకటన

jagapathi babu

jagapathi babu

Jagapathi Babu writes a letter to his fans: అభిమానులను ఉద్దేశిస్తూ జగపతి బాబు రిలీజ్ చేసిన ఒక ప్రకటన హాట్ టాపిక్ అయింది. అందరికీ నమస్కారం 33 ఏళ్ల గా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లా నా అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా భావించాననని జగపతిబాబు పేర్కొన్నారు. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ళ కష్టాలు నా కష్టాలుగా భావించి వాళ్ళు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నానని ఆయన అన్నారు. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మాను, కానీ బాధాకరణమయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయిందని ఆయన రాసుకొచ్చారు.

Thalapathy Vijay : విజయ్ దళపతి ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేసిన లోకేష్ కనగరాజ్..

నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు, మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి నాకు సంబంధం లేదు, నేను వాటి నుంచి విరమించుకుంటున్నాను, అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్న ఆయన జీవించండి, జీవించనివ్వండి ఇట్లు మీ జగపతి బాబు అంటూ ఒక లేఖ రిలీజ్ చేశారు. ముందుగా హీరోగా పలు సినిమాలు చేసిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్, తండ్రి పాత్రలు చేస్తున్నాడు. ఆయనకు హీరోగా ఉన్నపాప్తి నుంచి అభిమాన సంఘాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్లలో కొందరు హీరో అని ప్రేమ చూపించడం కంటే డబ్బులు ఆయన్నే ఎదురు అడుగుతూ మోసం చేస్తున్నట్లు ఈ లేఖ చూస్తుంటే అనిపిస్తుందని ఈ తరహా పనులకు చెక్ పెట్టాలని ఈ ట్వీట్ పెట్టాడని అంటున్నారు.

Exit mobile version