Site icon NTV Telugu

Jagapathi Babu: ఎప్పుడు తొక్కే.. త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది

Jaggu

Jaggu

Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఇప్పుడు మాస్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. తాను ఏం చేసినా.. ఫన్నీగా సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అచ్చ తెలుగు పదాలతో ఫన్ ను క్రియేట్ చేస్తూ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా జగపతి బాబు.. తన జీవితంలో మొట్ట మొదటి సారి ఫ్లైట్ లో మొదట అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీలు అంటే.. విమానం బయల్దేరుతుంది అన్న చివరి నిమిషంలో వాస్తు ఉంటారు. లేకపోతే మిడిల్ లో ఎక్కుతూ ఉంటారు. అలానే జగ్గూభాయ్ కూడా ఎప్పుడు ఎవరో ఒకరు ఉన్నప్పుడే విమానం ఎక్కేవాడట. అయితే ఈసారి మాత్రం విమానంలో మొదటి అడుగు తానే పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఆ ఫీల్ ను క్యాప్షన్ గా రాసుకొచ్చాడు.

Kavin: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ‘దాదా’ హీరో

” నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ ప్యాసింజర్ గా ఫ్లైట్ ఎక్కటం.. ఎప్పుడు తొక్కే దొరుకుతుంది.. త్రివిక్రమ్ చెప్పిన, నాకు బాగా నచ్చిన డైలాగ్.. విమానం ఎగురుతుంది, నువ్వు కాదు.. నువ్వు సీటులో కూర్చున్నావ్ అంతే.. డైలాగ్.. గుర్తొచ్చినది.. ఒకే డైలాగ్ లో లైఫ్ చెప్పాడు” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆ విమానం లో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజమే త్రివిక్రమ్ డైలాగ్స్ అన్ని బావుంటాయి అని కొందరు.. మీరు రాసే క్యాప్షన్స్ బావుంటాయి అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version