NTV Telugu Site icon

Jagapathi Babu: ఖాన్సార్ లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్

Jaggu

Jaggu

Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్ గా అందరి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సలార్ సినిమలో రాజమన్నార్ గా జగపతి బాబు నటన అదిరిపోయింది. కనిపించడానికి కొద్దిసేపే కనిపించినా.. ఖాన్సార్ చరిత్రను తిరగరాసిన ఘనత రాజమన్నార్ కే చెందుతుంది. తన తండ్రి కుర్చీని దక్కించుకోవడం కోసం శౌర్యంగ తెగను అంతం చేసిన క్రూరుడుగా నిలిచాడు. ఇక సలార్ సీజ్ ఫైర్ లో రాజమన్నార్ పాత్ర తక్కువగా ఉండొచ్చేమో కానీ, శౌర్యంగ పర్వంలో మొత్తం ధార, రాజమన్నార్ మధ్య యుద్ధం ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. దీంతో అందరూ.. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సలార్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈ నేపథ్యంలోనే జగ్గు భాయ్ అలియాస్ రాజమన్నార్.. థియేటర్ లో సందడి చేశాడు. ప్రేక్షకులతో కలిసి సలార్ సినిమా చూసాడు. అంతేకాకుండా రాజమన్నార్ గా ఖాన్సార్ నిబంధనలో కొత్త రూల్ ను జారీ చేశాడు. ” ఖాన్సార్ నిబంధన.. అందరు ఎల్లకాలం మన ప్రభాస్ ను ప్రేమిస్తూనే ఉండాలి.. హుకుమ్. రాజమన్నార్ చేసిన కొత్త చట్టానికి కట్టుబడి ఉండాలి ” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు.. హుకుమ్.. మేమెప్పుడూ ప్రభాస్ దాసులమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సెకండ్ పార్ట్ లో జగ్గు భాయ్ ఇంకెంత క్రూరుడిగా కనిపిస్తాడో చూడాలి.