NTV Telugu Site icon

Jagapathi Babu: పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశా.. చిన్నదానికి నేను పెళ్లి చేయను

Jagapathi Babu

Jagapathi Babu

Jagapathi Babu: నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో.. అని టక్కరి దొంగ లో మహేష్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ లైన్స్ మొత్తం టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇండస్ట్రీ మొత్తంలో ఆయనలాంటి వ్యక్తిత్వం ఇంకెవరికి ఉండదు. ఏది దాచుకోకుండా నిర్మొహమాటముగా ముఖం మీద చెప్పేస్తాడు. ఒకరి కోసం బతకడు.. ఒకరితో నీతులు చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదంటాడు. ఎవరి జీవితం వారిది అని చెప్పుకొచ్చే జగపతి బాబు.. వారి కూతుళ్ళ విషయంలో కూడా అదే ఫాలో అవుతాను అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఏరోజు.. ఏ ఇంటర్వ్యూలో కూడా తన వ్యక్తిగత విషయాలను ఈ హీరో పంచుకున్నది లేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కూతుళ్ళ గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.

Sree Vishnu: హిట్ కోసం ‘గే’ గా మారిన హీరో..?

జగపతిబాబు కు ఇద్దరు కూతుళ్లు.. మేఘన, అనుశ్రీ. మేఘనకు ఒక ఎన్నారైతో వివాహం జరిగింది. అయితే ఆ వివాహం చేసి తాను తప్పు చేశానని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ” నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయికి అమెరికా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశాను. తను అమెరికాలోనే ఉంటుంది. చిన్న కూతురికి పెళ్లి కాలేదు.. నన్ను అడిగితె నేను పెళ్లి చేసుకోవద్దనే చెప్పా.. తనకు ఇష్టం ఉండి.. పెళ్లి చేయండి అంటే.. నేను చేయను.. కావాలంటే నువ్వే ఒక అబ్బాయిని వెతుక్కొని పెళ్లి చేసుకో అని చెప్తా.. ఎవరి జీవితాన్ని శాసించే హక్కు మనకు లేదు. తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లు చూడాలి, వారి పిల్లలను చూడాలి అని చెప్పుకుంటూ వారి ఆశలను పిల్లల మీద రుద్దుతున్నారు. నేను అలా చేయను. అది స్వార్థం అవుతోంది. తండ్రిగా పెళ్లి చేయడం నా బాధ్యత అని చెప్పడం తప్పు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు అని మాత్రమే చెప్పాను. పెద్దమ్మాయి నాకు పిల్లలు వద్దు అంది. కుక్కలు, పిల్లులను పెంచుకొంటుంది. అది తప్పు అని నేను చెప్పలేదు.. నీ ఇష్టం అన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజెన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Show comments