Site icon NTV Telugu

Talk show : జగపతి షోలో సందీప్ రెడ్డి vs రామ్ గోపాల్ వర్మ.. పంచ్‌లు, ట్విస్టులు, ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ !

Jagapathi Babu Show

Jagapathi Babu Show

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తాజాగా సెన్సేషనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకులుగా రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. పంచ్‌లు, ఫ్రెండ్లీ ట్విస్టులు, నవ్వులు మిక్స్ అయి మొత్తం షోను ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌గా మార్చాయి. అత్యంత ఆసక్తికరమైన భాగం, ‘బెస్ట్ డైరెక్టర్ ఎవరు?’ అనే ప్రశ్నకు వచ్చిన షాక్ సమాధానమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read : Ileana: అమ్మగా బిజీ అయినా.. రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఇలియానా !

‘నువ్వు నన్ను పొగిడినంత మాత్రాన నేను నిన్ను పొగడను’ అనే రామ్ గోపాల్ వర్మ కామెంట్, జగపతి ఫ్రెండ్‌లను నవ్వులు కట్టేసింది. తర్వాత సందీప్ రెడ్డి వంగా ‘గాయం చూసేటప్పుడు జగపతి కోసం చూశావా, ఊర్మిళ కోసం చూశావా?’ అనే ఆర్జీవీ ప్రశ్నకు “నిజానికి మీకోసం చూశాను సర్” అని షాక్ ఇచ్చాడు. ఆర్జీవీ వెంటనే “ఏమైనా, ఈయన నాకు టీచర్ సర్” అంటూ స్పందించారు. అత్యంత ఆసక్తికరమైన భాగం, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా ఎవరు బెటర్ డైరెక్టర్ అనే ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ “రాజమౌళి బెటరా, నువ్వు బెటరా” అని అక్కడే ఉన్న సందీప్ ను అడగడంతో అవాక్ అయ్యారు. ఆ వెంటనే ‘కచ్చితంగా రాజమౌళి గారు ఎప్పుడు బెటర్’ అని సమాధానం ఇచ్చారు. మొత్తం మీద, ఆర్టిస్ట్‌ల మధ్య హ్యుమర్, ఫ్రెండ్లీ ట్విస్టులు, సీరియస్ కమెంట్స్ ఇలా మిక్స్ అయ్యి షోను ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ గా మార్చాయి. రామ్ గోపాల్ వర్మ చివరగా ‘నా చావు నేను చస్తా, మీ బతుకు మీరు బతకండి’ అని ఫినిష్ చేస్తూ ఆడియెన్స్‌ను నవ్వుల వర్షంలో మునిగించాడు.

 

Exit mobile version