Site icon NTV Telugu

Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు

Jaggu

Jaggu

Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. తన 60 ఏళ్ల జీవితంలో మొదటిసారి కాఫీ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ కాఫీని ఎలా తయారుచేసుకోవాలో కూడా వీడియోలో చూపించాడు.

ఒక కప్ తీసుకొని అందులో రెండు టీస్పూన్ ల కాఫీ పొడి వేసి వేడినీళ్లు కలుపుకుంటే బ్లాక్ కాఫీ అయిపోతుందని చెప్పాడు. అయితే చేసుకుంటే చేసుకున్నారు కానీ తాగవద్దని సలహా కూడా కూడా ఇచ్చాడు. అది కేవలం తాను మాత్రమే తాగగలను అని చమత్కరించాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ జగ్గూభాయ్ ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది. ” ఈ మధ్యన నాకు రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే.. చీర్స్” అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఆరోగ్యంగా ఉండడానికి వాటిని బండ్ చేసి ఆ ప్లేస్ లో బ్లాక్ కాఫీ తాగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం జగ్గు భాయ్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version