Peddi Pre Release Event: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిచిన చిత్రం “పెద్ది”. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు జగపతి బాబు చిత్ర యూనిట్‌పై, రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజిని దేవి హాస్పిటల్లో నేను పుట్టాను. ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసిన వాడిని మీతో పెరిగిన వాడిని మీతో ఉన్న వాడిని మీతో ఉండిపోయేవాడిని.. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవమో పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి, మాకు ఆర్టిస్టులకి మీ అందరి అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్‌కి వెళ్లిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరి ఆకలి, దాహం తీర్చే టైం ఇది, నాకు కూడా. ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి ఎనిమిదేళ్లు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్ది పెద్దిలో నా క్యారెక్టర్ నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్‌చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు.
ఇక మా బుచ్చిబాబు.. పోర్టబుల్ సైజులో, బటానీ సైజులో ఇంత ఉంటాడు తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత టాలెంట్ ఉందో.. అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది. తను పోర్టబుల్ ఎందుకన్నానంటే చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్‌ని ఎక్కడికంటే ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో చేర్చేసుకుంటారు. తను ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తారు సినిమా నేను ఎక్కువ చెప్పవసరం లేదు. జాన్విని మీలాగానే నేను ఫస్ట్ టైం ఇక్కడ కలిసాను. సినిమా చేశాం కానీ నేను కలవలేదు.. శ్రీదేవి గారు ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాన్విని మనందరం ట్రైలర్‌లో చూసాం, ఎంత బాగుందో. ఈ సినిమా జర్నీ ఎంజాయ్ చేయటం అనేది నాకు ఒక అద్భుతంగా ఉంది. ఇది నా జీవితంలో నా బెస్ట్ ఫిలిం అవుతుంది, నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని అన్నారు.
