NTV Telugu Site icon

Jagapathi Babu: జగ్గూభాయ్.. అంత ఓవరాక్షన్ అవసరమా..?

Jaggu

Jaggu

Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళలు మెచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోలకు ధీటైన విలన్ గా పేరు తెచుకుంటున్నాడు. ఇక మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ.. తన ముక్కుసూటితనంతో సోషల్ మీడియాలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు జగ్గు భాయ్. తన ఇంట్లో కాఫీ చేసుకోవడం, అమెరికా వెళ్ళినప్పుడు షాపింగ్ చేయడం లాంటి వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో క్యాప్షన్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా జగ్గూభాయ్ ట్విట్టర్ లో తన ఫోటోను షేర్ చేసి.. అందుకు డిఫరెంట్ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు.

Ram Charan: రామలక్ష్మికి చిట్టిబాబు బర్త్ డే విషెస్ భలే చెప్పాడే..

పింక్ కలర్ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్.. వైట్ హెయిర్, బ్లాక్ గాగుల్స్ తో జగ్గూభాయ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు. ఎప్పుడు, ఎక్కడ ఈ ఫోటోషూట్ జరిగిందో చెప్పలేదు.సాధారణంగా ఇలాంటి ఫొటోస్ షేర్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అనే మొదటి మాట అంత ఓవరాక్షన్ అవసరమంటావా..? అని.. ఇక అదే మాటను జగ్గు భాయ్ తన ఫొటోకు తానే క్యాప్షన్ గా పెట్టుకున్నాడు. ” అంత ఓవరాక్షన్ అవసరం అంటారా” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ క్యాప్షన్ పై అభిమానులు రిప్లై ఇస్తూ.. సూపర్ గా ఉన్నారు.. ఓవరాక్షన్ ఎక్కడ ఉంది..? అని కొందరు.. ఎందుకు బాబాయ్ అంత మాట అన్నావు..నీ లుక్ నీ స్టైల్ అది వేరే లెవల్..అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం జగపతి బాబు.. ప్రభాస్ సలార్, అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు బాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు.

Show comments