క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం, భాషాబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ‘పుష్ప’రాజ్. అయితే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సాగిన ‘పుష్ప’రాజ్ మేనియా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అండ్ విలన్ జగపతి బాబు వెల్లడించారు. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం గర్వించదగిన క్షణం అంటూ ‘పుష్ప’ టీంపై ప్రశంసలు కురిపించారు. జగ్గూ భాయ్ పాండా వేషం ధరించిన ఓ వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్టుకు అల్లు అర్జున్ కు వినయంగా సమాధానం ఇచ్చారు.
Read Also : Alia Bhatt Pics : బాత్ టబ్ లో అందాల ఆరబోత… అమాయక చూపులతో అరాచకం
“మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపడం గర్వించదగిన క్షణం…అది కూడా యానిమేషన్ పాత్రలతో…” సుకుమార్, అల్లు అర్జున్, పుష్ప బృందం బృందాన్ని అభినందించారు. ఆయన ప్రశంసలపై స్పందించిన అల్లు అర్జున్ “ధన్యవాదాలు జేబీ గారూ. మీరు దానిని వ్యక్తీకరించడం చాలా బాగుంది” అంటూ వినయపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
