Site icon NTV Telugu

Pushpa Kesava: అంబాజీపేటలో మెరిసిన పుష్ప కేశవ.. సినిమాలో అలా బయట ఇలా అంటూ!

Jagadeesh Prathap Bhandari In Ambajipeta Marriage Band

Jagadeesh Prathap Bhandari In Ambajipeta Marriage Band

Pushpa Kesava aka Jagadeesh Prathap Bhandari in Ambajipeta Marriage Band: పుష్ప సినిమాలో కేశవ అనే పాత్రలో నటించి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు జగదీష్ ప్రతాప్ భాండారి అనే యువకుడు. అతన్ని ఇప్పుడు జగదీష్ అనే పేరు కంటే ఎక్కువగా పుష్ప కేశవగానే గుర్తిస్తున్నారు. అనుకోకుండా అతను ఒక యువతి ఆత్మహత్య ప్రేరేపిత కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మెరిశాడు జగదీష్. మల్లిగాడు అదేనండి హీరో పాత్రధారి సుహాస్ స్నేహితుడు సంజీవి అనే పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి నటించాడు. నిజానికి నిజ జీవితంలో అతను ఒక యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు అనే అభియోగాల వల్ల జైల్లో ఉన్నాడు. ప్రస్తుతానికి కోర్టులో కేసు ఉంది కాబట్టి నిజా నిజాలు ఏమిటో కోర్టు త్వరలో తెలుస్తుంది.

Ambajipeta Marriage Band Movie Review: అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ

అయితే సినిమాలో మాత్రం జగదీష్ ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించాడు. ఆడవారికి చాలా గౌరవం ఇస్తూ, వారి ఆత్మ అభిమానాన్ని నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా వెళ్లే లాంటి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో అతనికి పుష్ప తర్వాత అంతగా నటించే అవకాశం ఉన్న పాత్రతో పాటు నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర దొరికినట్లు అయింది. నిజానికి అతని పాత్రకు ఇంత నిడివి ఉంటుందని కానీ స్కోప్ ఉంటుందని కానీ ఎవరు అనుకోలేదు. కానీ సినిమా చూసిన తర్వాత అది ఒక సర్ప్రైజ్ లాగా అనిపించింది. అతని కెరియర్ లో ఇది చెప్పుకోదగ్గ పాత్ర అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతను ప్రస్తుతానికి జైలుకు వెళ్లిన కేసుకి సినిమాలో అతని పాత్రకి అసలు పూర్తిగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమాలో పద్ధతిగా మంచి పాత్రలో నటిస్తే బయట మాత్రం ఇలా ఏంటో అంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అసలు విషయం ఏమిటి అనే అంశం మీద ఎవరికీ పూర్తిగా అవగాహన లేదు. కానీ అదే సమయంలో ఇలాంటి భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం యాదృచ్ఛికం అనే చెప్పాలి.

Exit mobile version