NTV Telugu Site icon

వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తున్న జాక్వెలిన్!

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సౌత్‌ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో రిలేషనల్‌ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొన్నారని తెలుస్తోంది. అందులోనే వీరిద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. బాలీవుడ్‌ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం సాధారణమైన విషయమే.. మరి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జాక్వలిన్ ఫెర్నాండేజ్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్​కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది.

Show comments