Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సిరీస్ లలో అంతగా నవ్వించిన సిరీస్ సేవ్ ది టైగర్స్. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన ఈ సిరీస్ హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ ముగ్గురు హీరోల సరసన జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని హీరోయిన్లుగా నటించారు. ఇక పనిమనిషిగా రోహిణి నటించింది. మొదటి సీజన్ లో రోహిణి, అభినవ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక సీజన్ 2 ఈ నెలలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా రోహిణి, అభినవ్ ఒక యూట్యూబ్ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో రోహిణి తన కెరీర్ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చింది.
“స్టార్టింగ్ లో నేనొక ఆడిషన్ కు వెళ్లాను. అప్పుడు కొంచెం కలర్ లేదు అన్నారు.. నేను వెంటనే మేకప్ వెయ్యరా.. ? అని అడిగాను. అంటే నేను మరి అంత కలర్ లేకుండా అయితే లేను.. ఛామన ఛాయగా ఉన్నాను. మీరు వేరేవాళ్లను పెట్టుకుంటే పెట్టుకోండి. నేను నా బెస్ట్ ఇచ్చాను. నాకు అప్పటికే జాబ్ వచ్చింది. ఇది లేకపోతే దానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఖచ్చితంగా వారిని ఇంప్రెస్ చేయాలి అనేది నాకు లేదు. ట్రై చేద్దాం.. వస్తే వచ్చింది.. లేకపోతే లేదు అనుకున్నాను.ఏ ఆడిషన్ కు వెళ్లినా కలర్ తక్కువ ఉంది.. సూపర్ గా నటించారు అని చెప్పేవాళ్ళే కానీ, అవకాశం ఇచ్చేవారు కాదు. నాకు వచ్చిన సీరియల్ ఆఫర్ కూడా లాస్ట్ లో ఎవరు సెట్ అవ్వకపోతే నాకు ఇచ్చారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం లో మావా అంటూ యాసలో మాట్లాడడం అదే నాకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇప్పటికీ ఆ డైరెక్టర్ ను నేను గురువుగా చూస్తాను. నాకోసం ఆయన సీన్స్ రాసేవారు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది ఆయన వలనే” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
