Site icon NTV Telugu

Jabardasth Pavithra: వాలెంటైన్స్ డే.. ప్రియుడుకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి

Pavithra

Pavithra

Jabardasth Pavithra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రోహిణి టీమ్ లీడర్ గా చేస్తున్న ఈ టీమ్ లో పవిత్ర కంటెస్టెంట్ గా చేస్తుంది. జబర్దస్త్ కు వచ్చిన దగ్గరనుంచి ఆమె తన ట్యాలెంట్ తో ఆనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈవెంట్స్, షోస్ అంటూ ఖాళీ లేకుండా తిరుగుతున్న పవిత్ర.. ప్రేమికుల రోజున అభిమానులకు చేదువార్త చెప్పుకొచ్చింది. ఆమె, తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పినట్లు అధికారికంగా చెప్పుకొచ్చింది. గతేడాది పవిత్ర.. ఒక స్టేజీమీద తన ప్రియుడు సంతోష్ ను పరిచయం చేసింది. తన జీవితంలోకి సంతోష్ వచ్చాక లైఫ్ మారిపోయిందని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.

2002 లో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రపోజ్ చేస్తే.. ఆమె ఓకే చెప్పింది. ఇక ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆమె తామిద్దరం విడిపోయామని చెప్పి షాక్ ఇచ్చింది. ” మా శ్రేయోభిలాషులందరికీ,పరస్పర అవగాహన ద్వారా, సంతోష్ మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు మరియు ఒకరినొకరు గౌరవించుకున్నందుకు మేము కృతజ్ఞులంగా ఉన్నాం. మా వ్యక్తిగత ప్రయాణాలలో మా ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని మరియు మాకు గోప్యత ఇవ్వాలని మేము మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగాలి. మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version