NTV Telugu Site icon

Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది

Prabhas

Prabhas

Jabardasth Mahesh: జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్.. రంగస్థలం సినిమాతో రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. ఈ సినిమా అతడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. వరుస అవకాశాలను అందిస్తుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్.. ప్రభాస్- మారుతీ సినిమాలో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు. ఇక తాజాగా మహేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. సాధారణంగా ప్రభాస్ గురించి, ఆయన ఆతిధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పలపాటి కుటుంబం మొత్తం తిండిపెట్టి చంపేస్తారు అని ఒక పేరు ఉంది. ప్లేస్ ఏదైనా.. ప్రభాస్ ఉన్న చోట మాత్రం ఫుడ్ మొత్తం ప్రభాస్ ఇంటినుంచే వస్తుంది. అలా అని మొహమాటానికి పెడతారు అనుకోకండి.. ఒక్కసారి ఒక్క ఐటమ్ నచ్చింది అని ప్రభాస్ కు చెప్పారా..? అప్పటినుంచి ఆ షూటింగ్ అయ్యేవరకు అదే ఐటమ్ తినిపిస్తూనే ఉంటారట. ఇదే విషయాన్నీ మహేష్ కూడా చెప్పుకొచ్చాడు.

Child Artists:అప్పటి బాలనటులు.. ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి

” షూటింగ్ లో 200 మంది ఉంటే 200… 300 ఉంటే 300 మందికి ప్రభాస్ గారి తరపు నుంచి ఫుడ్ వచ్చేస్తుంది
నాకు ఏ ఐటమ్ నచ్చిందో అడిగారు.. మటన్ అని చెప్తే తరువాత రోజు నుంచి నాకు అదే ఐటమ్ వచ్చేలా చేసారు ప్రభాస్ గారు” అని చెప్పుకొచ్చాడు. ఇక రాజా డీలక్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. ” చాలా రోజుల తర్వాత చెక్ షర్ట్స్ వేస్కొని మంచి కామెడీ రోల్ చేస్తున్నారు ప్రభాస్ అన్న.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు ఏ లుక్ లో వచ్చాడో.. అదే లుక్ ఈ సినిమాలో ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క హింట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు తెచ్చేసుకుంటున్నారు. ప్రభాస్ కామెడీ రోల్ నా .. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Show comments